పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీసులపై ఏపీ హోంమంత్రి అనిత ప్రశంసల వర్షం కురిపించారు. 'బుధవారం అర్ధరాత్రి నుంచి అదృశ్యమైనట్టు ఓ తండ్రి గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేయగానే, టెక్నాలజీ సాయంతో హైదరాబాద్ వెళ్తున్న బాలికలను సత్తెనపల్లి పోలీసుల సహకారంతో కేసును ఛేదించారు. కూటమి ప్రభుత్వంలో 'ప్రజాపోలీసింగ్' అర్థాన్ని చాటిన కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్, సత్తెనపల్లి డీఎస్పీ, సీఐలకు అభినందనలు' అని హోంమంత్రి ట్వీట్ చేశారు.