'కింగ్డమ్' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో 'ఒకే ఒక జీవితం' సినిమాలో ఎందుకు నటించలేదనే విషయాన్ని విజయ్ దేవరకొండ రివీల్ చేశారు. "ఒకే ఒక జీవితం స్క్రిప్టును మూడు సార్లు విన్నా. నాకు బాగా నచ్చింది. నటించడంతోపాటు ఆ చిత్రాన్ని నేనే నిర్మించాలనుకున్నా. కానీ, అది నా బాడీలాంగ్వేజ్‌కు సరిపోదనిపించింది. అందుకే నటించలేకపోయా.’’ అని విజయ్ తెలిపారు. తర్వాత 'ఒకే ఒక జీవితం'లో శర్వానంద్ హీరోగా చేశారు.