హీరో నాని తాజాగా నటించిన మూవీ హిట్–3. ఈ మూవీ. ఈ మూవీ థియేటర్లలో రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది. దీంతో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో అడవి శేషు మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బార్డర్లో భారత సైనికులు ఇస్తున్న ధైర్యంతోనే ఈ సక్సెస్ మీట్‌ను చేసుకోగలుగుతున్నామని అన్నారు. ఈ సమయంలో అందరూ సైనికులకు ధైర్యం, ప్రేమ అందివ్వాలని చెప్పారు.