మన దేశానికి స్వాతంత్య్రం 1947లోనే వచ్చినా, ఆ ఊరిలో విద్యుత్ తొలి వెలుగులు మాత్రం 2025లోనే ప్రసరించాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కేంద్రానికి 50 కి.మీ. దూరంలోని మారుమూల గ్రామం చిల్కపల్లిలో ‘నియాద్ నెల్లనార్ యోజన’ కింద విద్యుత్‌ను తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. రాబోయే కొన్ని నెలల్లో జిల్లాలోని మరిన్ని మారుమూల గ్రామాల్లోనూ విద్యుద్దీకరణ పనులు పూర్తవుతాయన్నారు.