సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లే ఇది సాధ్యమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు SC ఉపకులాల వర్గీకరణకు అడ్జర్న్ మోషన్ అందిస్తే తనను సభ నుంచి బయటకు పంపించారని అన్నారు. కానీ, ఈనాడు సభా నాయకుడిగా వర్గీకరణ అమలుకు సభలో నిర్ణయం తీసుకున్నాం అని రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.