ఫిబ్రవరి 14న ఆ స్కూళ్లకు సెలవు

60చూసినవారు
ఫిబ్రవరి 14న ఆ స్కూళ్లకు సెలవు
TG: షబ్-ఎ-బరాత్ (ముస్లింలకు పవిత్రమైన రాత్రి) సందర్భంగా ప్రభుత్వం ఫిబ్రవరి 14న సెలవు ప్రకటించింది. నెలవంక కనిపించడంతో ఆ రోజున షబ్-ఎ-బరాత్ నిర్వహించాలని మతపెద్దలు ఖరారు చేశారు. అయితే ఇది సాధారణ సెలవుదినం కాకుండా ఆప్షనల్ హాలిడేగా పేర్కొంది. ఫిబ్రవరి 14న కొన్ని పాఠశాలలకు సెలవు ఉండగా మరికొన్ని మైనారిటీ స్కూళ్లు మరుసటి రోజు సెలవు పాటిస్తాయి. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే వర్తించనుంది.