హైదరాబాద్ బస్సు ప్రయాణికులకు TGSRTC చేదువార్త చెప్పింది. ఇక నుంచి నగరంలో నైట్ రైడర్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రాత్రి 10.30నుంచి ఉ. 4గంటల వరకు గమ్యస్థానాలకు చేర్చే విధంగా ప్రత్యేకంగా రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసి బస్సు సర్వీసులను నడిపించారు. బస్సులకు సరైన ఆదరణ లేకపోవడం.. లాస్ట్‌మైల్ కనెక్టివిటీలో సమస్యలు రావడంతో సేవలను నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.