సీఎం రేవంత్‌కు షాకిచ్చిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు!

53చూసినవారు
సీఎం రేవంత్‌కు షాకిచ్చిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు!
TG: మంత్రివర్గ విస్తరణ అంశం సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది. ఈ మేరకు మంత్రి పదవి ఆశిస్తున్న నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అయితే నిన్న జరిగిన సీఎల్పీ భేటీకి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్‌, ప్రేమ్‌సాగర్‌రావు గైర్హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. కేబినెట్ విస్తరణలో తమకు చోటు కల్పించాలంటూ ఈ ముగ్గురు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, సీఎం, పార్టీ నాయకత్వంపై అలిగే వీరు సీఎల్పీ భేటీకి హాజరు కాలేదని పరచారం జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్