TG: బీజేపీ, TDP, కాంగ్రెస్ మూడు పార్టీలకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని BRS పార్టీ 'ఎక్స్'లో ట్వీట్ చేసింది. ప్రజాభవన్ వేదికగా గురుశిష్యులు భేటీ అయి ఏడాదైనా ఆస్తులు-అప్పుల సమస్యలు తీరలేదని BRS ఆరోపించింది. వీరిద్దరి ఫెవికాల్ బంధం తెలంగాణ రైతుల గొంతు కోస్తోందని మండిపడింది. 'వీరిద్దరి కుట్రలను తెలంగాణ సమాజం ఎప్పుడో పసిగట్టింది. గోదావరి జలాలను పక్క రాష్ట్రానికి దోచిపెడుతున్న రేవంత్ రెడ్డిని ప్రజలు క్షమించరు అని పేర్కొంది.