BRS తమ పార్టీ కార్యకర్తలను వేధించే కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఎవరైనా ఊరుకునేదే లేదని MLC కవిత హెచ్చరించారు. 'పార్టీ రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంత మంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసింది. ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్‌లో రాసుకుంటాం. బెదిరింపులకు పాల్పడేవారిని వదిలిపెట్టేదే లేదు. కేసులు పెట్టించే PSలకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదు' అని బాన్సువాడలో పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశంలో హెచ్చరించారు.