దేశంలో ఉగ్రదాడులు జరిగే ఛాన్స్ ఉందని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖను అప్రమత్తం చేశాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేయొచ్చని అంచనా వేశాయి. డ్రోన్, ఐఈడీ దాడులు జరగవచ్చని నిఘా సంస్థలు పేర్కొన్నాయి. తీవ్రవాదులు నదీ మార్గాల్లోనూ చొరబడవచ్చని తెలిపాయి. దీంతో జాగ్రత్తలు తీసుకోవాలని అలర్ట్ చేశాయి.