ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్.. పీఎస్‌లో ఫిర్యాదు

51చూసినవారు
ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్.. పీఎస్‌లో ఫిర్యాదు
తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్‌లోని మంగలహాట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత వారం రోజులుగా 9 వేర్వేరు నంబర్ల నుంచి చంపేస్తామని, బాంబులతో దాడి చేస్తామని బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తనకు మరియు కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. అధికారులు విచారణ ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్