అయోధ్య రామ మందిర ట్రస్టుకు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ విషయంపై పోలీసులు, నిఘా విభాగం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేశారు. కాగా, తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఈ మెయిల్ పంపినట్లు సమాచారం.