తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. రాష్ట్ర కాంగ్రెస్ కొత్త ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీలోని నేతలను మూడు కేటగిరీలుగా విభజించారు. మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నవాళ్లు ఒక గ్రూప్.. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు రెండో గ్రూప్, అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరినవారు మూడో గ్రూప్‌గా విభజించారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీలో కేటగిరీల వారీగా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చర్చ జరుగుతోంది.