TG: సీఎంఆర్ కళాశాలకు యాజమాన్యం మూడు రోజులపాటు సెలవులు ప్రకటించింది. వసతిగృహ స్నానాల గదిలో వీడియోలు చిత్రీకరించారంటూ విద్యార్థినులు చేసిన ఆరోపణలపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. హాస్టల్ వార్డెన్ సహా ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారి వేలిముద్రలను దర్యాప్తు బృందం సేకరించింది.