హమాస్ చెర నుంచి మరో ముగ్గురు బందీలు విడుదలయ్యారు. గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా శనివారం హమాస్ వారిని విడుదల చేసి రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. హమాస్ విడుదల చేసిన వారిలో సాగుయ్ డెకెల్ చెన్ (36), అలెగ్జాండర్ ట్రుఫనోవ్ (29), యైర్ హార్న్(46)లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ 369 మంది పాలస్తీనియన్లను విడుదల చేసింది.