రాష్ట్రంలో మూడు కొత్త కార్పొరేషన్లు : మంత్రి సీతక్క

66చూసినవారు
రాష్ట్రంలో మూడు కొత్త కార్పొరేషన్లు : మంత్రి సీతక్క
TG: మంత్రి సీతక్క ఎస్టీలకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో 3 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు సీతక్క కీలక ప్రకటన చేశారు. కొమరం భీం, సేవా లాల్, ఏకలవ్య పేరిట కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరి నది ఒడ్డున నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క ఎస్టీల కోసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్