ఒక నటునిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, ఓ మహోన్నత వ్యక్తిగా అక్కినేని నాగేశ్వరరావు అందించిన విశిష్ట సేవలను గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తమ అధికార పరిధిలోని సమస్త సినీ ఘన పురస్కారాలను ఆయనకు కట్టబెట్టి పట్టాభిషేకాలు చేశాయి. మూడు పద్మాలు.. పద్మశ్రీ పద్మభూషణ్, పద్మవిభూషణ్ పొందిన ఏకైక నటుడు అక్కినేని. అలాగే ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో తెలుగు వెలుగుల్ని హస్తినాపురం వరకూ ప్రసరింపచేసిన తొలి దక్షిణాది కథానాయకుడు అక్కినేని.