పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా లెదర్ కాంప్లెక్స్‌లో మ్యాన్‌హోల్ శుభ్రం చేస్తుండగా కాలువలో పడి ముగ్గురు కార్మికులు ఆదివారం మరణించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే కార్మికుల మరణానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు. ఈ విషయంపై అధికారులు విచారణ జరుపుతున్నారు.