ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు గ్రామంలో ఓ వ్యక్తి అరసెంటు (24 గజాలు) స్థలంలో అనుమతులు లేకుండా మూడంతస్తుల భవనం నిర్మించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆశ్చర్యానికి గురవగా, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా చూసి షాక్ అయ్యారు. వెంటనే భవనాన్ని కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. నియమాలు పాటించకుండా ఇలాంటివి నిర్మించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.