రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల బాలుడు మృతి

61చూసినవారు
రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల బాలుడు మృతి
TG: సూర్యాపేట జిల్లాలోని నెమ్మికల్ దండు మైసమ్మ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్లితే.. గురువారం నెమ్మికల్ వద్ద ఉన్న మైసమ్మ గుడికి మొక్కులు తీర్చుకునేందుకు కుటుంబ సమేతంగా వెళ్లారు. అయితే అక్కడ ఆడుకుంటున్న బాలుడు మోక్షిత్ రోడ్డుపైకి వచ్చాడు. వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో మృతి చెందాడు. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్