ఉత్తర్‌ప్రదేశ్ లఖింపూర్ ఖేరి జిల్లాలోని ఓ హోటల్‌లో జరిగిన వాదన ఘర్షణకు దారితీసింది. హోటల్‌లో ఆర్డర్ ఆలస్యం కావడంతో కస్టమర్లు హోటల్ యజమాని జగదీష్‌పై దాడికి పాల్పడ్డారు. అంతేకాదు ఒక్కసారిగా కర్రలతో అతన్ని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన అక్కడి సీసీటీవీలో రికార్డయింది. పాత కక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.