విద్యుత్ శాఖ ఉద్యోగులను కొట్టిన దుండగులు (వీడియో)

68చూసినవారు
యూపీలోని సంభాల్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బకాయిలు చెల్లించకపోవడంతో కరెంట్ కనెక్షన్‌ కట్ చేయడానికి వెళ్లిన విద్యుత్ శాఖ బృందంపై దుండగులు దాడి చేశారు. ఉద్యోగులను వెంబడించి మరీ కొట్టారు. విద్యుత్ శాఖ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అధికారులను కొట్టడం న్యాయం కాదని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్