8 ఏళ్ల బాలుడిని గొంతు కోసి చంపి చెట్టు వేలాడదీసిన దుండగులు (వీడియో)

62చూసినవారు
యూపీలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. లఖింపూర్‌లో 8 ఏళ్ల అమాయక దళిత బాలుడిని గొంతు కోసి చంపి, ఆ తర్వాత అతని మృతదేహాన్ని కొంతమంది దుండగులు చెట్టుకు వేలాడదీశారు. అయితే బాలుడి కుటుంబ సభ్యులు మాత్రం స్థానిక ఇన్‌స్పెక్టర్ ప్రత్యర్థుల నుంచి రూ.5లక్షలు తీసుకుని బాలుడిని చంపారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన లఖింపూర్‌లో సంచలనంగా మారింది. బాలుడిని ఎందుకు చంపారనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్