టిక్ టాక్ స్టార్‌ దారుణ హత్య (వీడియో)

64చూసినవారు
మెక్సికో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, టిక్‌ టాక్ స్టార్ వలెరియా మార్కెజ్(23) దారుణ హత్యకు గురైంది. గౌడలజరా నగరంలోని ఓ సెలూన్‌లో ఆమె లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా ఓ దుండగుడు ఆమె వద్దకు వచ్చాడు. 'వలెరియా నువ్వేనా?' ప్రశ్నించాడు. ఆమె 'అవును' అని చెబుతుండగానే ఛాతి, తలపై గన్నుతో కాల్చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆమె ఫోన్ తీసుకొని నిందితుడు పారిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్