ఎండిన మిరపను నిల్వ చేయడానికి తేమ లేనటువంటి శుభ్రమైన గోనె సంచులను ఉపయోగించాలి. ఈ గోనె సంచులకు తేనె తగలకుండా వరిపొట్టు లేదా చెక్కబల్లల మీద గోడలకు కాస్త దూరంలో నిల్వ ఉంచడం మంచింది. రైతులకు అవకాశం ఉండే మిరప బస్తాలను శీతల గిడ్డంగుల్లో నిల్వ చేస్తే రంగు, నాణ్యత తగ్గకుండా ఉంటుంది. కాయలు ఎండిన తర్వాత వాటిని నిల్వచేసేటప్పుడు వాటికి మంచి రంగు రావాలని ఎలాంటి రసాయనాలను, మందులను ఉపయోగించకూడదట.