AP: తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల జూలై నెల కోటాను TTD మంగళవారం ఉ. 10 గంటలకు విడుదల చేసింది. వర్చువల్ సేవలు, వాటి దర్శనం స్లాట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. జూలై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది.