AP: తిరుపతి తొక్కిసలాట మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా రోదించారు. బైరాగిపట్టెడలో బుధవారం జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన ఐదుగురికి.. శ్రీనివాసం వద్ద అస్వస్థతకు గురై మృతి చెందిన మహిళకు రుయా ఆస్పత్రిలో శవపరీక్షలు పూర్తి చేశారు. అనంతరం మృతదేహాలను స్వస్థలాలకు తరలిస్తుండగా బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఉత్తర ద్వార దర్శనం ఇమ్మంటే వైకుంఠానికే రమ్మించుకున్నావే.. మా కుటుంబాలకు దిక్కెవరు వెంకన్న స్వామి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.