TNPL 2025: అశ్విన్‌కు భారీ జరిమానా! (వీడియో)

57చూసినవారు
టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్‌పై తమిళనాడు ప్రీమియర్ లీగ్ నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకున్నారు. మహిళా అంపైర్ వెంకటేశన్ కృతిక నిర్ణయాన్ని తప్పుబడుతూ అశ్విన్ దురుసుగా ప్రవర్తించిన ఘటనను మ్యాచ్ రిఫరీ సీరియస్‌గా పరిగణించారు. అశ్విన్ మ్యాచ్ ఫీజులో 30శాతం కోతం విధించారు. తన తప్పిదాన్ని అశ్విన్ రిఫరీ ముందు అంగీకరించాడు. యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలవాల్సిన అశ్విన్ హద్దులు దాటి ప్రవర్తించకూడదని నెటిజన్లు సూచిస్తున్నారు.