తల్లిదండ్రులు తమ పిల్లలతో మంచి ఆలోచనలు, ఉన్నతమైన విలువలు పెంపొందించాలని కలలు కంటారు. చెడు సహవాసం, చుట్టు పక్కల ఉండే చెడు వాతావరణం వారిని చెడగొడుతుంది. దీనివల్ల పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు. గౌరవం ఇవ్వరు. కృతజ్ఞతతో ఉండటం, క్షమించే గుణం, దైవభక్తి వంటివి పిల్లలకు నేర్పించాలి. తప్పులను అంగీకరించడం, నిజాయితీగా ఉండటం అలవాటు చేయాలి.