భ‌ర్త‌తో మాట్లాడించేందుకు రూ. 2 వేలు డిమాండ్ చేసిన పోలీసు

59చూసినవారు
భ‌ర్త‌తో మాట్లాడించేందుకు రూ. 2 వేలు డిమాండ్ చేసిన పోలీసు
TG: లగచర్లలో అధికారుల‌పై దాడి చేసిన ఘ‌ట‌న‌లో పోలీసులు ప‌లువురిని అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. అందులో పాత్లావత్ ప్రవీణ్ అనే వ్య‌క్తిని కూడా అరెస్ట్ చేశారు. ప్ర‌వీణ్ భార్య జ్యోతి ప్ర‌స్తుతం గ‌ర్బిణీ. అయితే స్టేష‌న్‌లో ఉన్న తన భ‌ర్త‌తో మాట్లాడించేందుకు ఓ పోలీస్ అధికారి రూ. 2 వేలు లంచం డిమాండ్ చేశార‌ని ప్ర‌వీణ్ భార్య జ్యోతి ఆరోపించించారు. అంత డ‌బ్బు త‌న ద‌గ్గ‌ర లేదని వెయ్యి రూపాయలు ఇస్తే త‌న భ‌ర్త‌తో మాట్లాడించార‌ని జ్యోతి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్