ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ సూచన మేరకే తమ పార్టీ నేత జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేశారని BRS నేత హరీశ్ రావు ఆరోపించారు. అసెంబ్లీ చరిత్రలో ఈరోజు బ్లాక్ డే అని వ్యాఖ్యానించారు. స్పీకర్‌పై ఏకవచనం వాడలేదని ఒకవేళ వాడి ఉంటే శాసనసభ నియమాల పుస్తకంలో ఏకవచనం వాడటం తప్పుగా చెప్పలేదన్నారు. దళిత కార్డును అడ్డం పెట్టుకొని ప్రభుత్వం రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. దళిత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ దేనన్నారు.