మహారాష్ట్ర సీఎం ఎంపికపై నేడు కీలక భేటీ

51చూసినవారు
మహారాష్ట్ర సీఎం ఎంపికపై నేడు కీలక భేటీ
మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరనేదానిపై నేటితో తెరపడనుంది. నేడు ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోడీ, అమిత్‌ షా, జేపీ నడ్డాలతో ఏక్‌నాథ్‌ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ భేటీ తర్వాత కేబినెట్‌ కూర్పుపై తుది నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా సేవలందిస్తున్న దేవేంద్ర ఫడ్నవిస్‌ సీఎం పీఠాన్ని దక్కించుకోడవం దాదాపు ఖరారయినట్లు తెలుస్తోంది. సీఎం ఎంపిక బాధ్యతను షిండే.. బీజేపీ పెద్దలకు అప్పగించడంతో దీనికి బలం చేకూరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్