నేడు ఆగస్టు 6 తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి. తెలంగాణే శ్వాసగా.. తెలంగాణే ధ్యాసగా.. తెలంగాణ లక్ష్యంగా బ్రతికి ..ఎంతోమందిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు ఆచార్య కొత్తపల్లి జయశంకర్. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర మరువలేనిది. బంగారు తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పోరాట యోధుడు ఆయన. ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా ఆయన ప్రజలను ముందుండి నడిపించారు.