ఈ ఏడాది మాఘ శుద్ధ సప్తమి ఇవాళ ఉదయం 7.53 నుంచి రేపు ఉదయం 5.30 వరకు ఉంది. ఇవాళ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఆదిత్యుని పూజకు మంచి సమయం. ఆదిత్యుడికి జిల్లేడు పత్రాలంటే ప్రీతి. ఉదయాన్నే రెండు భుజాలు, శిరస్సుపైన మూడు చొప్పున జిల్లేడు ఆకులను, వాటిపై కొద్దిగా బియ్యం ఉంచి స్నానం చేస్తే ఆరోగ్యం చేకూరుతుందని నమ్మకం. సూర్య కిరణాలు ప్రసరించే చోట రథం ముగ్గు వేసి భగవానుని పూజించాలి. పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి.