భువనేశ్వర్లో నేటి నుంచి రెండు రోజులపాటు అఖిల భారత పోలీస్ డైరెక్టర్ జనరల్స్(డీజీపీ), ఐజీల మహాసభ నిర్వహించనున్నారు. ఈ మహాసభలో ప్రధాని మోదీ ఉగ్ర నిరోధం, వామపక్ష తీవ్రవాదం, తీరప్రాంత భద్రత, కొత్త నేర చట్టాలు, డ్రగ్స్ సహా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక విభాగాలపై చర్చించనున్నట్లు పీఎంవో తెలిపింది. అలాగే, మోదీకి వివరించే అమూల్య అవకాశం కూడా సీనియర్ పోలీస్ అధికారులకు ఈ సభలో కలుగుతుందని పీఎంవో పేర్కొంది.