బాబు జగ్జీవన్ రామ్ (1908-1986) భారత రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన స్వాతంత్ర్య సమర యోధుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు. బీహార్‌లో దళిత కుటుంబంలో జన్మించి, అంటరానితనం, కుల వివక్ష నిర్మూలనకు జీవితాన్ని అంకితం చేశారు. 27 ఏళ్లకే పార్లమెంట్ సభ్యుడిగా ప్రస్థానం ప్రారంభించి, 50 ఏళ్లు ఎంపీగా సేవలందించారు. ఆయన సేవలు భారత రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. నేడు ఆయన వర్ధంతి.