ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా ఆదివారం జరిగే చివరి టీ20లో ఇంగ్లాండ్‌ను ఢీకొంటుంది. సిరీస్ గెలిచిన ఉత్సాహంతో భారత్.. ఆఖరి మ్యాచ్‌లో నెగ్గి గౌరవంగా సిరీస్‌ను ముగించాలనే ఆరాటంతో ఇంగ్లాండ్ ఉన్నాయి. ఈ మ్యాచ్ జరిగే ముంబై వాంఖడే స్టేడియంలో పిచ్ ఎప్పుడూ బ్యాటింగ్‌కే అనుకూలం. ఈసారీ పరుగుల వరద ఖాయం. ఆరంభంలో పేసర్లకు, తర్వాత స్పిన్నర్లకు సహకారం లభిస్తుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్‌కు మొగ్గు చూపొచ్చు.