శరీరంలో ప్రధానమైన అవయవాల్లో కాలేయం ఒకటి. రక్తం నుంచి మలినాలను, శరీరం నుంచి వ్యర్థాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో సుమారు 500 రకాల పనులు చేసే అవయవంగా దీనికి పేరుంది. కాలేయానికి ఏదైనా సమస్య వచ్చి 30 నుంచి 40 శాతం తొలగించినప్పటికీ తిరిగి వంద శాతానికి స్వయం ఉత్పత్తి చేసుకునే శక్తి సైతం ఉంది. ప్రజల్లో సరైన అవగాహన కల్పించడం కోసం ఏటా ఏప్రిల్ 19న 'ప్రపంచ కాలేయ దినోత్సవం' నిర్వహిస్తున్నారు.