కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల టోల్ ఫీజుల విధానాన్ని సవరించింది. 2008లో ఉన్న యూజర్ ఛార్జీల నియమాలను మార్చి, సొరంగాలు, వంతెనలు ఉన్న రహదారులపై టోల్ లెక్కింపు విధానంలో మార్పులు చేసింది. దీనివల్ల త్వరలో టోల్ ఛార్జీలు సగం వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ పరిణామంతో వాహనదారులపై భారం తక్కువయ్యి, ప్రయాణ వ్యయం తగ్గి, రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఏర్పడింది.