టమాట పంట కాలాన్ని సాధారణంగా నాలుగు దశలుగా విభజించవచ్చు.
1. నారు దశ 24 నుంచి 26 రోజులు.
2. మొక్కలు పొలంలో నాటిన తర్వాత పూతకొచ్చే దశ 30 నుంచి 35 రోజులు.
3. పూతకొచ్చిన తర్వాత మొదటి కోతకు 30 నుంచి 35 రోజులు పడుతుంది.
4. కాయకోతలు ప్రారంభమైన తర్వాత, రకాన్ని బట్టి 45 నుంచి 55 రోజుల వరకు కాపు వస్తుంది.
ఈ దశలలో ఆశించే పురుగులు, తెగుళ్లపై రైతులు స్పష్టమైన అవగాహన పెంచుకొని, అవసరమైన చర్యలు చేపడితే మంచి ఆదాయం వస్తుంది.