తెలుగు రాష్ట్రాల్లో టమాటా రేట్లు భారీగా తగ్గాయి. వారం క్రితం గరిష్ఠ ధర రూ.1,800 నుంచి రూ.2,300 వరకు ఉండగా.. ప్రస్తుతం క్వింటా కనీస ధర రూ.800, గరిష్ఠ ధర రూ.1,480లకు పడిపోయింది. దీంతో బహిరంగ మార్కెట్‌లో కేజీ టమాట రూ.10-20గా ఉంది. ఈ సీజన్లో సాగు పెరగడం, నాణ్యత లేకపోవడమే ధరల పతనానికి కారణమని మార్కెట్ వ్యాపారులు చెబుతున్నారు. గిట్టుబాటు ధరల్లేక అల్లాడుతున్న రైతులు కనీస మద్దతు ధర రూ.1,500 ఇవ్వాలని కోరుతున్నారు.