టమాటా ధర ఢమాల్.. పంటకు నిప్పు పెట్టిన రైతులు
TG: టమాటా ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయి. గత పదిరోజుల వరకూ రూ.50 పలికిన ధర ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయింది. నాణ్యమైన టమాటా సైతం 25 కిలోల ట్రేను కేవలం రూ.200లకే విక్రయిస్తున్నారు. రైతు బజార్లలో కిలో టమాటాను రూ.10లకు అమ్ముతున్నారు. దీంతో పెట్టుబడి ఖర్చు కాదు.. రవాణా ఖర్చులకు కూడా రాకపోవడంతో మెదక్‌లోని శివంపేట మండలం నవాబ్ పేటలో టమాటా రైతులు పంటను ధ్వంసం చేసి, నిప్పు పెట్టారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.