ఇకపై రైతు బజార్లలో తక్కువ ధరకే టమాటాలు

1543చూసినవారు
ఇకపై రైతు బజార్లలో తక్కువ ధరకే టమాటాలు
ఏపీలో పెరిగిన టమాటా ధరలపై మార్కెటింగ్ శాఖ అధికారులు సమీక్ష నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో మాత్రమే ఉత్పత్తి కావడం, పొరుగు రాష్ట్రాల్లో సాగు లేకపోవడం వల్ల డిమాండ్ పెరిగిందని.. ధరల స్థిరీకరణ నిధి ద్వారా టమాటా కొనుగోలు చేసి రైతు బజార్లలో విక్రయించాలని నిర్ణయించారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి 30 టన్నుల టమాటా కొనుగోలు చేసి గుంటూరు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లోని రైతు బజార్లలో కొనుగోలు ధరలకే విక్రయించనున్నట్టు చెప్పారు.

సంబంధిత పోస్ట్