ప్రతి ఏడాది మాఘ మాసంలో వచ్చే శుక్ల పంచమిని 'వసంత పంచమి'గా వ్యవహరిస్తారు. వసంత పంచమి ఫిబ్రవరి 3న రానుంది. ఈ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. వసంత పంచమి రోజు బ్రహ్మ ముహూర్తం సాయంత్రం 5.23 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.16 గంటలకు ముగుస్తుంది. పవిత్ర నదుల్లో స్నానాలు కూడా ఆచరిస్తారు. వసంత పంచమి రోజున మహా కుంభమేళాలో నాలుగవ రాజస్నానం నిర్వహిస్తారు.