కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిన ప్రాంతాలకు కేంద్ర ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేస్తుంది. బడ్జెట్ ప్రపోజల్స్‌తో పాటు గత సంవత్సర ఆదాయ వ్యయాల డేటా సేకరిస్తుంది. ఉన్నతాధికారుల సమీక్ష, నీతి ఆయోగ్‌తో సంప్రదింపుల తర్వాత లోటుబడ్జెట్ పూడ్చడానికి చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సూచనలను కేంద్ర ఆర్థిక శాఖ తీసుకుంటుంది. అన్ని రంగాల నుంచి సిఫార్సులు, డిమాండ్లు పరిగణనలోకి తీసుకుని కేంద్ర బడ్జెట్‌ను రూపొందిస్తుంది.