పర్యాటకుల బోటు బోల్తా.. ఇద్దరు మహిళలు మృతి

27చూసినవారు
పర్యాటకుల బోటు బోల్తా.. ఇద్దరు మహిళలు మృతి
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బోటు బోల్తా పడటంతో ఇద్దరు పర్యాటకులు మృతి చెందారు. సర్పన్ పల్లి ప్రాజెక్టులో ఐదుగురు పర్యాటకులు బోటులో షికారుకు వెళ్లారు. అయితే ఈ క్రమంలో బోటు బోల్తా పడటంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్