యూపీలో కిల్లర్ తోడేళ్లను పట్టుకోవడానికి ఎరగా చిన్నారుల మూత్రంతో తడిపిన బొమ్మలు!

62చూసినవారు
యూపీలో కిల్లర్ తోడేళ్లను పట్టుకోవడానికి ఎరగా చిన్నారుల మూత్రంతో తడిపిన బొమ్మలు!
ఉత్తరప్రదేశ్‌లో 'ఆపరేషన్ భేడియా'లో భాగంగా కిల్లర్ తోడేళ్లను పట్టుకునేందుకు చిన్నారుల మూత్రంతో తడిపిన మృదువైన బొమ్మలను వాటికి ఎరగా వేస్తున్నారు. తద్వారా మనిషి వాసనలా భ్రమింపజేసి వాటిని ఉచ్చులోకి లాగేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వీటి గుంపులో ఆరు తోడేళ్లు ఉండగా నాలుగింటిని ఇప్పటికే పట్టుకున్నట్లు అటవీ శాఖ తెలిపింది. యూపీలోని బహరాయిచ్ జిల్లాలో గత 2 నెలల్లోనే తోడేళ్ల దాడిలో కనీసం ఎనిమిది మంది చనిపోయారు.

సంబంధిత పోస్ట్