TG: భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
ఆ మహనీయుడి చిత్రపటానికి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలు కొనసాగించడమే ఆ మహనీయుడికి మనం ఇచ్చే ఘన నివాళి అన్నారు. అంబేద్కర్ ప్రేరణతో రాష్ట్రంలో కాంగ్రెస్ సుపరిపాలన అందిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత వీహెచ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఇతర నేతలు పాల్గొన్నారు.