ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో శుక్రవారం (ఫిబ్రవరి 14) షాకింగ్ ఘటన జరిగింది. ఓ ట్రాక్టర్ అతివేగంగా దూసుకొచ్చింది. అదుపుతప్పి నేరుగా పోలీస్ ఔట్ పోస్ట్‌ను ఢీకొట్టింది. రెప్పపాటులో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ అక్కడే ఉన్న పోలీసులు, వాహనదారులు తప్పుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే పోలీస్ ఔట్ పోస్ట్ నామరూపాల్లేకుండా పోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.